వన్డే మహిళల వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో పాకిస్తాన్ జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే ఇంటి దారి పట్టింది. ఆడిన ఏడు మ్యాచ్‌లలోనూ ఓటమి పాలైంది, మరికొన్ని వర్షం కారణంగా రద్దయ్యాయి. దీంతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచిన పాకిస్తాన్ టోర్నమెంట్ నుంచి వైదొలిగింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, టీమిండియా సెమీ ఫైనల్ కు చేరుకున్నాయి.