
లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఆఖరి గంటలో కొనుగోళ్లతో సెన్సెక్స్ 223 పాయింట్లు ఎగిసి 81,207 వద్ద, నిఫ్టీ 58 పాయింట్లు పెరిగి 24,894 వద్ద స్థిరపడ్డాయి. వరుసగా రెండో రోజు సూచీలు రాణించగా, ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపుకు సంకేతాలు ఇవ్వడం, గ్లోబల్ మార్కెట్ల సానుకూలత కలిసొచ్చాయి. టాటా స్టీల్, పవర్‌గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్ లాభపడగా, టెక్ మహీంద్రా, మారుతీ నష్టపోయాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 88.79గా ఉంది.




