ప్రపంచ తెలుగు మహాసభలకు ఒడిశా గవర్నర్‌కు ఆహ్వానం

24985చూసినవారు
ప్రపంచ తెలుగు మహాసభలకు ఒడిశా గవర్నర్‌కు ఆహ్వానం
గుంటూరులో జనవరి 3 నుంచి 5 వరకు జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభలకు ఒడిశా గవర్నర్‌ కంభంపాటి హరిబాబుకు నిర్వాహకులు ఆహ్వానపత్రిక అందజేశారు. భువనేశ్వర్‌లోని రాజ్‌భవన్‌లో ఆంధ్ర సారస్వత పరిషత్‌ అధ్యక్షుడు గజల్‌ శ్రీనివాస్‌ గవర్నర్‌ను కలిసి, జనవరి 3న సాయంత్రం అమరావతి శ్రీ సత్య సాయి స్పిరిచ్యువల్‌ సిటీ ప్రాంగణంలో నందమూరి తారకరామారావు వేదికపై నిర్వహించే ‘పూర్ణ కుంభ పురస్కార సభ’కు ముఖ్య అతిథిగా విచ్చేయాలని ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్