మహారాష్ట్రలోని పుణెలో సోషల్ మీడియాలో వచ్చిన మోసపూరిత ప్రకటనను నమ్మి 44 ఏళ్ల కాంట్రాక్టర్ ఒకరు ఏకంగా రూ. 11 లక్షలు పోగొట్టుకున్నాడు. 'ప్రెగ్నెంట్ జాబ్ సంస్థ' పేరుతో రిజిస్ట్రేషన్, ఐడెంటిటీ కార్డు, జీఎస్టీ, ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో డబ్బు డిమాండ్ చేశారు. సెప్టెంబర్ మొదటి వారం నుండి అక్టోబర్ 23 వరకు 100 సార్లు చిన్న మొత్తాలలో రూ. 11 లక్షలు బదిలీ చేశాడు. మోసగాళ్లు నంబర్ బ్లాక్ చేయడంతో బాధితుడు బనేర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.