TG: హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ ఎమ్మార్వో కార్యాలయంలో అయ్యప్ప దీక్షలో ఉన్న సర్వేయర్ కిరణ్, అతని సహచరుడు భాస్కర్, రూ. 1 లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఇద్దరు కూడా అయ్యప్ప మాలాధారణలో ఉండి కూడా తమ లంచావతారాన్ని మాత్రం వదలక పోవడం గమనార్హం.