పుణెలోని పింపెర్‌ఖేడ్ వద్ద, 30 రోజుల్లో ముగ్గురిని బలిగొన్న చిరుతపులిని అధికారులు బోనులో బంధించారు. చిరుత సంచారం స్థానికుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న పరిస్థితి నెలకొనడంతో అటవీ శాఖ ట్రాప్ కెమెరాలను, బోన్లను ఏర్పాటు చేసి చిరుతను బంధించారు. ప్రజల భద్రత దృష్ట్యా అధికారులు ఈ చర్యలు చేపట్టారు. బోనులో బంధించిన చిరుతను చూడడానికి స్థానికులు క్యూకట్టారు.