ఒంటి కాలితో బడికి వెళ్తున్న చిన్నారి.. రాగిణికి సాయం చేస్తామన్న అధికారులు

7చూసినవారు
ఉత్తరప్రదేశ్ బల్లియా జిల్లాకు చెందిన 7 ఏళ్ల రాగిణి.. ఆరు నెలల వయసులో జరిగిన ప్రమాదంలో ఎడమ కాలును కోల్పోయింది. పేదరికంలో ఉన్నప్పటికీ, 1వ తరగతి చదువుతున్న ఈ చిన్నారి ప్రతిరోజూ 400 మీటర్ల దూరంలో ఉన్న బడికి ఒంటి కాలితోనే గెంతుకుంటూ వెళ్తోంది. స్కూలుకు వెళ్లడానికి పడుతున్న కష్టాలను వివరిస్తూ, తనకు ఒక ట్రై సైకిల్ లేదా కృత్రిమ కాలు ఇప్పించాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేయగా సాయం అందిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్