పవన్ కల్యాణ్ ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. సెప్టెంబర్ 25న విడుదలైన ఈ సినిమా 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.308 కోట్లకుపైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ ఏడాదిలో అత్యధిక గ్రాస్ సాధించిన తెలుగు సినిమాగా నిలిచింది. విడుదల రోజే రూ.154 కోట్ల వసూళ్లు సాధించిన ‘ఓజీ’ పవన్ కెరీర్‌లోనే కొత్త మైలురాయిగా నిలిచింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ రికార్డును కూడా అధిగమించింది.