AP: శ్రీ సత్య సాయి జిల్లా ముదిగుబ్బ మండలంలోని భాస్కర్ రెడ్డి అనే రైతు రెండు ఎకరాల్లో రూ. 3 లక్షల పెట్టుబడితో టమాటా పంట సాగించారు. అయితే ఈ మధ్య వర్షాలు అధికంగా పడటంతో పంట మొత్తం నల్లమచ్చలు వచ్చి నష్టం వచ్చింది. దీంతో రైతు ఏడు ట్రక్కుల టమాటాను రోడ్డు పక్కన పారబోసే పరిస్థితి ఏర్పడింది. “తెగుళ్లు రాకపోతే, ప్రస్తుత ధరల ప్రకారం రూ. 3 లక్షలకు పైగా ఆదాయం వచ్చేది. కానీ నాకు నష్టం వచ్చింది. అందుకే టమాటాను పారబోసా” అని రైతు వాపోయారు.