గబ్బా వేదికగా జరుగుతున్న ఐదో టీ20లో టీమ్‌ఇండియా మళ్లీ టాస్‌లో ఓడిపోయింది. ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో, భారత్ బ్యాటింగ్‌కు దిగింది. ఈ సందర్భంగా భారత బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా సరదాగా స్పందించాడు. టాస్ తర్వాత సూర్యకుమార్ యాదవ్‌ను ఉద్దేశించి.. “మళ్లీ ఓడిపోయావా?” అని ఆటపట్టించాడు. ప్రస్తుతం ఈ సంభాషణ వైరల్‌గా మారి అభిమానులను నవ్విస్తోంది.