యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ఆయిల్ ట్యాంకర్ వెనుక నుంచి కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను పోలీసులు చాకచక్యంగా బయటకు తీశారు. తీవ్రంగా గాయాలు కావడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో విజయవాడ-హైదరాబాద్ హైవేపై సుమారు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు ట్యాంకర్‌ను తొలగించి, ట్రాఫిక్‌ను పునరుద్ధరించే చర్యలు చేపట్టారు.