బెండకాయలతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ.. విటమిన్ సి, విటమిన్ కె, మెగ్నీషియం, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. బెండకాయలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. ముఖ్యంగా బెండకాయ గుండె ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది.