పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తూ 'ఓజీ' చిత్ర బృందం 'ఓమి ట్రాన్స్' పూర్తి వెర్షన్‌ను విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజున విడుదలైన 'ఓమి' గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన లభించగా, ఇప్పుడు వచ్చిన ఈ పాట అభిమానుల ఆసక్తిని మరింత పెంచుతోంది. ఈ పాట 'ఓజాస్' (పవన్ కళ్యాణ్) మరియు 'ఓమి' (ఇమ్రాన్ హష్మీ)ల మధ్య భీకర పోరాటాన్ని సూచిస్తుంది.సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ ఉరుములు, మెరుపులను తలపించే బీట్స్‌తో 'ఓమి ట్రాన్స్'ను ఎంతో శక్తివంతంగా స్వరపరిచారు. ఈ పాట ప్రేక్షకులను నిజంగా ట్రాన్స్‌లోకి తీసుకువెళ్తుందని విమర్శకులు చెబుతున్నారు. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్‌లు ఇప్పటికే సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. సాధారణ ప్రేక్షకులతో పాటు సినీ పరిశ్రమ ప్రముఖులు కూడా ఈ సినిమాకు ఇక ప్రచారం అవసరం లేదని అంటున్నారంటే, దీనిపై ఉన్న అంచనాలు ఎంత భారీగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని ఒక 'సినిమాటిక్ తుఫాను'గా రూపొందిస్తున్నారని తెలుస్తోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.'ఓజీ' సెప్టెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమా తుఫానుకు కౌంట్‌డౌన్ మొదలైందని చెప్పొచ్చు.