ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యలను నివారించాలనే ఉద్దేశంతో 1960లో ఎర్విన్ రింగెల్, నార్మన్ ఫార్బెరో ‘ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ (ఐఏఎస్పీ)' అనే స్వచ్ఛంద సంస్థలను నెలకొల్పారు. ఆత్మహత్యల నివారణకు సంబంధించి ఒక ప్రత్యేక రోజు ఉండానే ఐఏఎస్పీ, WHO భావించాయి. అందుకు అనుగుణంగా ఏటా సెప్టెంబరు 10న 'ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం'గా జరుపుకోవాలని ఈ రెండు సంస్థలు తీర్మానించాయి. 2003 నుంచి ప్రతి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు.