కేరళ ఓనం బంపర్ లాటరీలో టీఎల్ 360615 నంబరు టికెట్‌కు రూ.30 కోట్ల మొదటి బహుమతి దక్కింది. విజేత ఎవరో ఇంకా తెలియరాలేదు. కన్నూర్‌లోని ముత్తు లాటరీ ఏజెన్సీ ఈ టికెట్‌ను విక్రయించింది. పన్నులు, కమీషన్ తదితరాలు మినహాయించగా విజేతకు రూ.16.47 కోట్లు అందనున్నాయి. రెండో బహుమతిగా 20 మందికి ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున ఇవ్వనున్నారు. ఈసారి ముద్రించిన మొత్తం 90 లక్షల ఓనం బంపర్ టికెట్లు పూర్తిగా అమ్ముడయ్యాయి. దీంతో దాదాపు రూ.450 కోట్ల టర్నోవర్ నమోదైంది. టికెట్ల విక్రయాల ద్వారా ప్రభుత్వానికి రూ.241.20 కోట్లకుపైగా ఆదాయం సమకూరింది.