అధికారంలోకి వచ్చాక వదిలిపెట్టేది లేదు: కేటీఆర్ (వీడియో)

7చూసినవారు
TG: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి కోసం కాకుండా సొంత భూములు, ఆస్తులు కాపాడుకోవడానికే ఆయన రేవంత్ రెడ్డి పంచన చేరారని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అక్రమాలకు పాల్పడిన ఎవరినీ వదిలిపెట్టమని, నాగుపాముల్లా బుసలు కొడుతున్న వారిని కూడా వదిలే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్