AP: అనంతపురం జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గుత్తి సమీపంలోని ఎన్పీటీసీ ట్రాన్స్‌కో విభాగంలో ఏడీఈగా పనిచేస్తున్న మౌనిక విధులకు హాజరైన సమయంలో, ఆమె కుమారుడు ఏడాదిన్నర రక్షిత్ రామ్ ఆడుకుంటూ పొరపాటున వాటర్ బాటిల్ మూతను మింగేశాడు. అది గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక విలవిల్లాడాడు. వెంటనే గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించినప్పటికీ, వైద్యుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. బాబు చనిపోయాడు. కొడుకుని కోల్పోయిన మౌనిక కన్నీరుమున్నీరుగా విలపించారు.