
భారత్ రష్యా చమురు కొనుగోలును ఆపిసింది: ట్రంప్ (వీడియో)
ఇకపై రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయదని, భారత ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాను ఒంటరిని చేయడంలో ఇది కీలక అడుగు అని వైట్ హౌస్ మీడియా సమావేశంలో ఆయన పేర్కొన్నారు. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం వల్ల పుతిన్ యుద్ధాన్ని కొనసాగిస్తున్నారని తాము భావిస్తున్నామని, ఈ విషయంపై మోదీతో మాట్లాడగా ఆయన సానుకూలంగా స్పందించారని ట్రంప్ తెలిపారు. అయితే ఈ విషయంపై భారత్ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.




