దేశంలో పెరుగుతున్న డ్రగ్స్ సమస్యపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాల సమస్యను ప్రజారోగ్య సమస్యగా కాకుండా, పిల్లలను కాపాడాల్సిన సమస్యగా చూడాలని ఆయన సూచించారు. దేశంలో కౌమారదశలో ఉన్న ప్రతి ఐదుగురు పిల్లల్లో ఒకరు డ్రగ్స్ బారిన పడే అవకాశం ఉందని, ఇటీవల విడుదలైన లాన్సెట్ అధ్యయనాన్ని ఉటంకిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ నుంచి బయటపడటానికి కుటుంబసభ్యులు, సమాజం పిల్లలకు మద్దతు ఇవ్వాలని సీజేఐ సూచించారు.