TG: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పరిధిలో సుమారు లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టబోతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఇళ్లు లేక ఇబ్బంది పడుతున్న పేదలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇళ్ల కేటాయింపునకు సంబంధించిన అర్హుల ఎంపికలో పూర్తి పారదర్శకత పాటించనుంది. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన పేదలకు మాత్రమే ఇళ్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని భావిస్తోంది.