మంచు మనోజ్ పై దాడి కేసులో ఒకరు అరెస్ట్

6240చూసినవారు
మంచు మనోజ్ పై దాడి కేసులో ఒకరు అరెస్ట్
TG: నటుడు మంచు మనోజ్ పై దాడి కేసులో తాజాగా పహడి షరీఫ్ పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల క్రితం తనపై దాడి చేశారని మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి సమయంలో సీసీ ఫుటేజ్ మాయం చేశారని ఆరోపించారు. దీంతో విష్ణు అనుచరుడు కందుల వెంకట్ కిరణ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు విజయ్ రెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్