తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు భారీగా పడిపోయాయి. హైదరాబాద్ మార్కెట్లో 6 కేజీల ఉల్లిపాయలు కేవలం రూ.100కే అమ్ముడవుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో కిలో రూ.20కి పడిపోయింది. టమాటా ధరలు కూడా కిలో రూ.10-15కి చేరాయి. వంకాయ కిలో రూ.25-30, దొండకాయ, పచ్చిమిర్చి కిలో రూ.50, క్యాప్సికం రూ.45కు విక్రయిస్తున్నారు. ఈ ధరల పతనం సామాన్యులకు ఊరటనిస్తున్నా, రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు.