తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. హైదరాబాద్లో మూడు రోజుల క్రితం రూ.100కు 3–4 కిలోల వరకు లభించిన ఉల్లి.. ప్రస్తుతం కిలో రూ.50 వరకు పలుకుతోంది. మలక్పేట్ వ్యవసాయ మార్కెట్లోనూ ధరలు భారీగా పెరిగాయి. గతంలో క్వింటా హోల్సేల్ ధర రూ.2,500–రూ.3,000 ఉండగా, ప్రస్తుతం రూ.4,500–రూ.5,000కు చేరినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లి దిగుమతులు తగ్గడం, సరఫరా తగ్గడంతో ధరలు పెరిగాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. ఉల్లి ధరల పెరుగుదలతో సామాన్యుల వంటింటిపై అదనపు భారం పడుతోంది.