ఆన్‌లైన్ గేమింగ్ కారణంగా ఓ వివాహిత ప్రాణాలను తీసింది. బెంగళూరు శివారు నేలమంగళకు చెందిన రంజిత (28) ఆన్‌లైన్ గేమ్‌లలో భారీగా డబ్బులు నష్టపోయి, అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకుంది. గతంలోనే కుటుంబ సభ్యులు రూ. 15 లక్షల అప్పులు తీర్చినప్పటికీ, ఆమె మళ్లీ గేమ్‌లు ఆడి మరింత అప్పులు చేసినట్లు పోలీసులు తెలిపారు. భర్త పనిమీద ఊరెళ్లిన సమయంలో రంజిత ఇంట్లో ఉరివేసుకుంది. ఈ ఘటనపై నేలమంగళ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.