ప్రజలు ఎన్నుకున్న నాయకులే చర్చకు రావాలి: మంత్రి పొన్నం

5590చూసినవారు
హైదరాబాద్‌లో గురుకులాల్లో అవినీతి జరిగిందన్న బీఆర్‌ఎస్‌ ఆరోపణలపై తెలంగాణ మంత్రులు చర్చకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ నేతల ఆరోపణలు అబద్ధాలని, కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లల అభ్యున్నతిని తట్టుకోలేకనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రజలు ఎన్నుకున్న నాయకులే చర్చకు రావాలని, పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రొక్యూర్‌మెంట్‌పై కూడా చర్చకు సిద్ధమని మంత్రి సవాల్‌ విసిరారు.

సంబంధిత పోస్ట్