తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) నిర్వహించిన ఎస్ఎస్‌సీ, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. సెప్టెంబర్ 22 నుంచి 28 వరకు జరిగిన ఈ పరీక్షలకు 9,717 మంది హాజరు కాగా, 4,748 మంది (48.86 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 2,900 మంది బాలురు, 1,848 మంది బాలికలు ఉన్నారు. అభ్యర్థులు www.telanganaopenschool.org వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చూసుకోవచ్చు.