నకిలీ పత్రాలు సృష్టించి సొంత బ్యాంకులో బంగారు రుణాలు తీసుకొని బురిడీ కొట్టించిన ఘటన హన్మకొండలో జరిగింది. ధర్మసాగర్(M) ముప్పారం యూనియన్ బ్యాంక్ బ్రాంచ్‌లో ఈ ఘటన జరిగింది. బ్యాంక్ మేనేజర్ సురేష్ అనే వ్యక్తి పది గోల్డ్ లోన్ అకౌంట్లు తెరిచి రూ.74,92,000 మంజూరు చేయించుకున్నాడు. బ్యాంక్ ఉద్యోగి ఇచ్చిన సమాచారంతో అధికారులు విచారణ చేపట్టారు. గోల్డ్ లాకర్ తెరిచి చూడగా ఖాళీ గోల్డ్ పౌచ్‌లు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదయ్యింది.