
బస్సు ప్రమాదంలో తల్లి మృతి.. దీనస్థితిలో ముగ్గురు పిల్లలు
TG: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పలు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనలో దాదాపు 20 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఓ మహిళ మరణించగా, ఆమె భర్త తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలించారు. వారి ముగ్గురు పిల్లలు క్షేమంగా బయటపడ్డారు. అయితే తల్లి మృతి చెందడం.. తండ్రి ఆస్పత్రిలో ఉండటంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఆ చిన్నారులు ఉండిపోయారు.




