
E20 పెట్రోల్‌పై వెనక్కి తగ్గే పరిస్థితి లేదు: కేంద్రం
E20 పెట్రోల్‌పై వెనక్కి తగ్గే పరిస్థితి లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపీ సమాధానమిచ్చారు. E20 పెట్రోల్ వల్ల వాహనాలు పాడవుతాయని, మైలేజీ తగ్గుతుందన్న ఆరోపణలను తోసిపుచ్చారు. ఇందులో ఉండే ఆక్టేన్ వల్ల యాక్సిలరేషన్ మెరుగుపడుతుందని చెప్పారు.




