‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఈ క్రమంలో ఇరాన్‌లో చిక్కుకున్న తమ విద్యార్థులను ‘ఆపరేషన్ సిందు’ చేపట్టి ప్రత్యేక విమానాల్లో భారత్ స్వదేశానికి తీసుకొస్తోంది. మరోవైపు తమ విద్యార్థులను కూడా తరలించాలని భారత్‌ను పొరుగు దేశాలు నేపాల్, శ్రీలంక కోరాయి. అందుకు భారత్ అంగీకరించి గొప్ప మనసు చాటుకుంది.