జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26 మంది పర్యాటకులను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులకు, వారికి ఆశ్రయం ఇచ్చిన పాకిస్తాన్‌కు భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ రూపంలో గట్టి సమాధానం ఇచ్చింది. సరిగ్గా ఏడాది క్రితం శత్రు స్థావరాలపై నిప్పుల వాన కురిపించిన ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురువారం విడుదల చేసింది. ‘భారత్ దేన్నీ మర్చిపోదు, ఎవరినీ క్షమించదు’ అంటూ శత్రువుల వెన్నులో వణుకు పుట్టించే సందేశాన్ని యావత్ ప్రపంచానికి ఐఏఎఫ్ ఇచ్చింది.