
బాహుబలి వీడియోతో అమెరికాకు ఇరాన్ కౌంటర్
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో జింబాబ్వేలోని ఇరాన్ కాన్సులేట్ ‘ఎక్స్’లో ‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమాలోని ఓ కీలక సన్నివేశాన్ని షేర్ చేసింది. బాహుబలి కలకేయులపై సైన్యాన్ని నడిపించే సన్నివేశాన్ని.. ఐరాసలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ప్రసంగంతో పోల్చింది. ఆంక్షలు, బెదిరింపులు పెంచినా ఇరాన్ తలవంచబోదనే సందేశాన్ని ఈ వీడియో ద్వారా ఇచ్చినట్లు తెలుస్తోంది.




