పార్టీ ఆఫీస్‌లోనే.. ప్రతిపక్ష నేత దారుణ హత్య (వీడియో)

45267చూసినవారు
శ్రీలంకలోని వెలిగామా కౌన్సిల్ ఛైర్మన్ లసంత విక్రమశేఖర (38) బుధవారం తన పార్టీ కార్యాలయంలో ప్రజల సమస్యలు వింటున్న సమయంలో ఇద్దరు దుండగులు చొరబడి కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయన ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వెలిగామా కౌన్సిల్ నియంత్రణపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఉన్న పోరు నేపథ్యంలో ఈ హత్య రాజకీయాల్లో కలకలం రేపింది. దుండగుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్