ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్(సీఈసీ)పై విపక్షాలు పార్లమెంటు ఉభయ సభల్లో అభిశంసన తీర్మానం నోటీసును ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ అంశంపై ఇతర ప్రతిపక్ష పార్టీలను
కాంగ్రెస్ సంప్రదించినట్లు తెలుస్తోంది. రాబోయే రెండు వారాల్లో ఈ నోటీసులను సమర్పిస్తారని
కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్నికల కమిషన్లో భిన్నాభిప్రాయాల అంశం రాజకీయ దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే.