TG: రాష్ట్రవ్యాప్తంగా వరి ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి, రవాణాలో అడ్డంకులు తొలగించడానికి రవాణా శాఖ కమిషనర్ కార్యాలయం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సివిల్ సప్లైస్ విజ్ఞప్తి మేరకు, జిల్లా అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ ధాన్యం తరలింపుకు అవసరమైన వాహనాలను సిద్ధం చేయాలని జిల్లా రవాణా అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణ కేంద్రాల నుండి నిల్వ కేంద్రాలు, రైస్ మిల్లులకు రవాణా సాఫీగా సాగేందుకు తగినన్ని సరుకు రవాణా వాహనాలను అందుబాటులో ఉంచాలని సూచించారు.