TG: ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సేవల ఫీజులను 20 నుంచి 100% వరకు భారీగా పెంచింది. ఈ పెంపు 2026-27 విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి వస్తుంది. కండోనేషన్ ఫీజు, అటెస్టేషన్ చార్జీలు, ట్రాన్స్‌ఫర్ ఫీజులు గణనీయంగా పెరిగాయి. ఈ నిర్ణయాన్ని విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వర్సిటీ ఆర్థిక సంక్షోభాన్ని విద్యార్థులపైకి నెడుతోందని ఏబీవీపీ విమర్శించింది. అయితే, ఫీజులు సమీక్షించి సవరిస్తామని రిజిస్ట్రార్ తెలిపారు.