భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోని టాప్ ఫైవ్‌లో ఒకటిగా ఎదుగుతుందని, దిగుమతులపై ఆధారపడే దేశం నుంచి ఎగుమతుల్లో శక్తివంతమైన దేశంగా మారుతుందని ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. సింగపూర్‌లో ప్రవాస తెలుగు సభ్యులతో జరిగిన ముఖాముఖీలో మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ.. సంక్షోభాలను ఎదుర్కొనే స్థితి నుంచి అవకాశాలను సృష్టించే స్థితికి
భారత్ చేరిందని, జీడీపీ వృద్ధి రేటు 4.4 శాతం నుంచి 7-8 శాతానికి పెరిగిందని, స్టార్టప్ ఎకోసిస్టమ్ 50 లక్షల నుంచి 125 యూనికార్న్‌లకు విస్తరించిందని, ద్రవ్యోల్బణం 2 శాతం తగ్గిందని వివరించారు.