వారికి కూడా అందుబాటులో ఓటీటీ కంటెంట్... కేంద్రం మార్గదర్శకాలు

6చూసినవారు
వారికి కూడా అందుబాటులో ఓటీటీ కంటెంట్... కేంద్రం మార్గదర్శకాలు
వినికిడి, దృష్టి లోపం ఉన్నవారికి కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలోని ఆడియో, వీడియో కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ముసాయిదా మార్గదర్శకాలను జారీ చేసింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ రాజ్యసభలో ఈ విషయాన్ని వెల్లడించారు. అక్టోబర్ 7న ప్రజాభిప్రాయం కోసం విడుదల చేసిన ఈ నిబంధనలను రెండు దశల్లో అమలు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. భారత మీడియా, వినోద పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.

సంబంధిత పోస్ట్