
తెల్లారితే పెళ్లి .. గుండెపోటుతో నవ వధువు మృతి
కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా అజ్జంపురలో విషాదం చోటు చేసుకుంది. తెల్లారితే పెళ్లి జరగాల్సి ఉండగా గుండెపోటుతో నవ వధువు మృతి చెందింది. శ్రుతి (32) అనే యువతికి తరికెరెకు చెందిన దిలీప్‌తో ఈ నెల 31న పెళ్లి జరగాల్సి ఉంది. వివాహ సన్నాహాలు ముమ్మరంగా జరుగుతుండగా ఈరోజు శ్రుతి గుండెపోటుతో మరణించింది. దీంతో రెండు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.




