TG: అసెంబ్లీలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. MLAలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలి ఆయన అన్నారు. అలాగే ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారని, ఏ నిధులు వచ్చిన ఆ జిల్లాకే పోతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. అయితే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పందించారు. 'ఖమ్మంకే వెళ్తున్నాయని రాజగోపాల్ రెడ్డి అంటున్నాడు.. అయితే ముగ్గురు మంత్రులకే వస్తున్నాయేమో కానీ మాకు మాత్రం నిధులు రావడం లేదు' అని అన్నారు.