మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మన శంకర వరప్రసాద్ సినిమా నుంచి వినాయక చవితి కానుకగా కొత్త పోస్టర్ విడుదలైంది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి డ్యూయెల్ రోల్‌లో కనిపించనున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్‌లో నదిపై పడవలో పట్టు పంచె కట్టుకొని స్టైలిష్‌గా నిల్చున్న చిరంజీవి ఫొటో వైరల్‌గా మారింది. నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, వెంకటేశ్ ప్రత్యేక పాత్రలో సందడి చేయనున్నారు.