తెలంగాణలో నీళ్లు, కరెంట్ వంటి సాధారణ అవసరాల కోసం కూడా ప్రజలు రోడ్డెక్కి పోరాడాల్సిన దుస్థితి నెలకొందని మాజీ మంత్రి
కేటీఆర్ ధ్వజమెత్తారు. జూరాల సాగునీటి ప్రాజెక్ట్ వద్ద నెలకొన్న నీటి సమస్యపై ఆయన స్పందిస్తూ, నిరసనలు తెలిపితే తప్ప రాష్ట్రంలో ఏ పనీ జరగని వాతావరణం నెలకొందని ఆరోపించారు. ప్రభుత్వం నీటిని విడుదల చేసినప్పటికీ, రైతుల సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం ముగియదని, అక్టోబర్లో పంట కోతలు పూర్తయ్యే వరకు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటామని, రైతుల పక్షాన నిలబడి నిరంతరం పోరాటం సాగిస్తామని
కేటీఆర్ తేల్చిచెప్పారు.