TG: ఇల్లు లేని వారికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లాలో పర్యటన సందర్భంగా మాట్లాడుతూ.. 'రామగుండం సమస్యలను పరిష్కరిస్తున్నాం. దేశంలో పేదలకు సన్నబియ్యం ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మాది. ఉచిత విద్యుత్, ఉచిత బస్సు లాంటి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం. ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా విజన్ 2047 రూపకల్పన చేశాం' అని వివరించారు.