హత్య కేసులో బెయిల్‌పై బయటకొచ్చి.. రన్నింగ్ కారుపై కూర్చొని హల్‌చల్ (వీడియో)

13చూసినవారు
హత్య కేసులో బెయిల్‌పై బయటకొచ్చిన నిందితుడు రన్నింగ్ కారుపై కూర్చొని హల్‌చల్ చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సత్యం శుక్లా(16) అనే యువకుడి హత్య కేసులో నిందితుడు మాన్ సింగ్ 14 నెలల జైలు జీవితం తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. జైలు నుంచి బయటకు రాగానే అతని స్నేహితులు పూలదండలతో స్వాగతం పలికారు. అనంతరం బొలెరో బానెట్‌పై కూర్చుని పొగ తాగుతూ హంగామా చేశాడు. వాహనాల కాన్వాయ్‌తో రోడ్డుపై హల్‌చల్ చేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్