వరద నీటిలో ప్రమాదకర డ్రైవింగ్.. శ్రీలంకలో బస్సు డ్రైవర్‌పై ఆగ్రహం

81చూసినవారు
శ్రీలంకలో భారీ వర్షాలు, వరదల కారణంగా పలు డ్యాములు పొంగిపొర్లాయి. కందలముల్ల ప్రాంతంలో ఒక బస్సు డ్రైవర్, బ్రిడ్జిపై నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తున్నా లెక్కచేయకుండా ప్రమాదకరంగా బస్సును నడిపిన సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో, బస్సు అదుపుతప్పి ఉంటే పదుల సంఖ్యలో ప్రాణాలు పోయేవని నెటిజన్లు డ్రైవర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్