
వైభవ్ కోసం మూడు ప్లాన్లు సిద్ధం: కమిన్స్
ఐపీఎల్ 2026 సీజన్లో ఎలిమినేటర్ మ్యాచ్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ సిద్ధమయ్యాయి. ముల్లన్‌పుర్ వేదికగా బుధవారం రాత్రి జరగనున్న ఈ కీలక పోరులో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తుంది. సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్, రాజస్థాన్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని ఔట్ చేయడానికి మూడు విభిన్న ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ప్లాన్ A విఫలమైతే ప్లాన్ B లేదా C అమలు చేస్తామని ఆయన తెలిపారు. ఈ సీజన్లో SRH ఇప్పటికే రాజస్థాన్‌పై రెండుసార్లు గెలిచింది.




