రూ.1000 కోట్లతో ప్రభుత్వ ఆఫీసులకు సొంత భవనాలు!

4చూసినవారు
రూ.1000 కోట్లతో ప్రభుత్వ ఆఫీసులకు సొంత భవనాలు!
TG: రాష్ట్రంలోని అద్దె గృహాల్లో ఉన్న ఆఫీసులకు దశలవారీగా సొంత భవనాలు నిర్మించాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తద్వారా ఇప్పుడు చెల్లిస్తున్న కోట్లాది రూపాయల అద్దెల భారాన్ని తగ్గించుకోనుంది. మండలం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆఫీసులు అద్దె భవనాల్లో ఉండడానికి వీల్లేదని, వాటికి నిర్ణీత విస్తీర్ణంలో సొంత భవనాలు నిర్మించాలని CM ఇప్పటికే అధికారులను ఆదేశించారు. వచ్చే బడ్జెట్లో వీటికి రూ.1000 కోట్ల నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :