43 ఏళ్ల కంపెనీ అమ్మేసి.. కార్మికులకు రూ.కోట్లు పంచిన యజమాని!

10చూసినవారు
43 ఏళ్ల కంపెనీ అమ్మేసి.. కార్మికులకు రూ.కోట్లు పంచిన యజమాని!
అమెరికాలోని లూసియానాలో 43 ఏళ్లుగా నడిచిన ఫైబర్‌బాండ్ కార్పొరేషన్ విద్యుత్ పరికరాల తయారీ కంపెనీని 'ఈటన్'కు 1.7 బిలియన్ డాలర్లకు విక్రయించారు. ఈ అమ్మకం ద్వారా వచ్చిన మొత్తంలో 15 శాతం, అంటే సుమారు రూ. 2000 కోట్లను, కంపెనీలోని 540 మంది పూర్తిస్థాయి ఉద్యోగులకు పంచాలని సీఈఓ గ్రాహం వాకర్ నిర్ణయించారు. ప్రతి ఉద్యోగి సగటున రూ. 3.75 కోట్లు అందుకోనున్నారు. ఈ బోనస్ రాబోయే ఐదేళ్లలో చెల్లిస్తారు, ఉద్యోగులు కంపెనీలో కొనసాగితేనే పూర్తి మొత్తం లభిస్తుంది. 1982లో ప్రారంభమైన ఈ కంపెనీ కష్టసుఖాల్లో తోడుగా నిలిచిన ఉద్యోగులకు ఈ ఔదార్యం చూపారు.

సంబంధిత పోస్ట్