ఓయోలో యువతి మృతి కేసు.. ప్రియుడి ఆత్మహత్యాయత్నం

47చూసినవారు
ఓయోలో యువతి మృతి కేసు.. ప్రియుడి ఆత్మహత్యాయత్నం
TG: మాదాపూర్ ఓయో హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి కేసులో పరారీలో ఉన్న ప్రియుడు రవితేజ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఏపీలోని అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ఈదుమెట్ల మర్రిపాలెంలోని తన ఇంట్లో బుధవారం ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ తాగడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. కాగా ఈ నెల 21న ఓయోలో అర్ధరాత్రి యువతి అపస్మారక స్థితికి చేరుకోవడంతో కొత్తగూడలోని అపోలో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్