పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' చిత్రం సెప్టెంబర్ 25న విడుదలైంది. ఈ మూవీ విడుదలైనప్పటి నుంచి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. తాజాగా "ఫైర్ స్ట్రోమ్" పాటపై ఒక కళాశాల యువతి చేసిన క్లాసికల్ నృత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకోవడంతో పాటు, 'ఓజీ' సినిమా క్రేజ్‌ను మరింత పెంచింది. తొలి రోజు భారీ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సృష్టిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.